కోర్టు తీర్పులను స్వాగతిస్తున్నం..ఈ తీర్పు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలకు గట్టి గుణపాఠం: కిషన్ రెడ్డి

కోర్టు తీర్పులను స్వాగతిస్తున్నం..ఈ తీర్పు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలకు గట్టి గుణపాఠం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ల ఫిరాయింపు రాజకీయాలకు గుణపాఠం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ అనర్హతపై కోర్టు తీర్పులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం..

వారికి మంత్రిపదవులు ఇవ్వడం చేస్తూ రెండు పార్టీలు ఒక దురదృష్టకర సంస్కృతిగా మార్చాయని ఫైర్ అయ్యారు. ప్రజాతీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో పోటీ పడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని విమర్శించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శించడం, అధికారంలోకి వచ్చాక అదే ఫిరాయింపులను ప్రోత్సహించడం ఈ రెండు పార్టీల రాజకీయ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుంది.

ఆనాడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇస్తే... నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకొని ఏకంగా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది’అని గుర్తుచేశారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌‌‌‌‌‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందన్నారు. ఈ ఉప ఎన్నికలో అవకాశవాద, స్వార్థ, ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా తమ ప్రతినిధిని ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీల కుళ్లు రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పేలా... స్థానిక ఓటర్లు బీజేపీకి పట్టం గట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.